మరో హిందీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమంత గ్రీన్‌ సిగ్నల్

మరో హిందీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమంత గ్రీన్‌ సిగ్నల్

‘ద ఫ్యామిలీ మేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’లో స్లీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించి మెప్పించిన సమంత.. ఈసారి స్పైగా కనిపించేందుకు రెడీ అవుతోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే వెబ్ సిరీసుల మీద కూడా దృష్టి పెడుతున్న సామ్.. మరో హిందీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘అవెంజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ తీసిన రసో 
బ్రదర్స్ ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే అమెరికన్ యాక్షన్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీస్తున్నారు. అందులో ప్రియాంకా చోప్రా హీరోయిన్. యూకేలో షూటింగ్ జరుగుతోంది. వచ్చే యేడు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమ్ కానుంది. దీన్ని హిందీలో కూడా తీసేందుకు అమెజాన్ సంస్థ ప్లాన్ చేసింది. ‘ఫ్యామిలీ మేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ తీసిన రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీకేలకు ఆ బాధ్యత అప్పగించింది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సమంతను తీసుకున్నారు. ఇద్దరూ రా ఏజెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నారు. వచ్చే యేడు ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లనుంది. త్వరలోనే అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రానుంది. మరోవైపు తాప్సీ నిర్మించనున్న ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ సమంత నటించనుందనే వార్తలు వినిపిస్తు న్నాయి. మొత్తానికి బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా తన ముద్ర వేసేందుకు సమంత సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే ట్రై చేస్తోందన్నమాట.