Samantha: ఆడిషన్కు ఆటోలో!..సమంత ఫెయిల్యూర్ స్టోరీ ఇదే

Samantha: ఆడిషన్కు ఆటోలో!..సమంత ఫెయిల్యూర్ స్టోరీ ఇదే

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చింది. తొలి చిత్రం ఏమాయ చేశావేతో అందరినీ మాయ చేసింది. అక్కడి నుంచి ఆమె సక్సెస్ వేరె లెవల్లో సాగింది. జెస్సీగా వెండితెరకు పరిచయమై కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. మొదటి సినిమాకే సామ్కు మంచి పేరు రావడంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కింది.

సమంత హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ టైమ్ ఆటోలో ఓ సినిమా ఆడిషన్కు వెళ్లిందట. ఆ మూవీ మేకర్స్ ఆమెను రిజెక్ట్ చేశారట. ఆ చిత్రం.. 2010లో విడుదలైన స్నేహగీతం. లార్స్కో చిత్ర పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మాతగా మధురా శ్రీధర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మూడు ప్రేమ జంటల మధ్యలో తిరిగే ఆ కథలోనే సందీప్ కిషన్, వెంకీ అట్లూరి (ఇప్పుడు దర్శకుడు), చైతన్య హీరోలుగా నటించారు. ఇక శ్రేయ ధన్వంతరి, సుహాని, మహిమ హీరోయిన్స్గా నటించారు.

అలా చాన్స్ మిస్సయిన సమంత..ఇప్పుడు ఒక్కో మూవీకి రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొనే స్థాయికి ఎదిగింది. గతేడాది శాకుంతలం, ఖుషి మూవీలతో వచ్చిన సమంత..త్వరలో సిటాడెల్ అనే ఇంటర్నేషనల్ సిరీస్ తో రానుంది. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ మరో లీడ్ రోల్లో కనిపించనున్నారు. ఆడియాన్స్ను అలరించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.