నా భాగస్వామి ప్రభావితం వల్ల గుర్తించలేదు.. నేను చేసిన పెద్ద తప్పు అదే!

నా భాగస్వామి ప్రభావితం వల్ల గుర్తించలేదు.. నేను చేసిన పెద్ద తప్పు అదే!

సౌత్ బ్యూటీ సమంత(Samantha) షాకింగ్ కామెంట్స్ చేశారు. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు గురించి చెప్తూ తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. స్టార్ హీరోయిన్ సమంత ఓపక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. తన ఫ్యాన్స్ తో స్పెషల్ చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు సమంత. 

ఈ చిట్ చాట్ లో భాగంగా నెటిజన్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు సమంత. నా ఇష్టాయిష్టాలు తెలుసుకోవడంలో విఫలమయ్యాను. అదే నేను చేసిన పెద్ద తప్పులేదు. అది తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే అప్పుడు నాపై భాగస్వామి ప్రభావం ఎక్కువగా ఉండేది. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వాటి విలువ మనకు అర్థమవుతుంది అంటూ.. చెప్పుకొచ్చారు సమంత. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ వెడ్ సిరీస్ సిటాడెల్ హింద్ వర్షన్ లో హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సిరీస్ లు సమంత జోడీగా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ కాకుండా.. మరో రెండు హాలీవుడ్ ప్రాజెక్టులలో కూడా నటిస్తున్నారు సమంత.