బ్యాక్ టు వర్క్.. సమంత ఫోటో వైరల్

బ్యాక్ టు వర్క్.. సమంత ఫోటో వైరల్

మూడేళ్ల క్రితం ఫ్యామిలీ మ్యాన్‌‌‌‌ 2(Familu Man2) వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సమంత(Samantha).. త్వరలో సిటాడెల్‌‌‌‌(Citadel) అనే మరో సిరీస్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్‌‌‌‌ ధావన్‌‌‌‌(Varun Dhavan)తో కలిసి ఆమె నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ను రాజ్‌‌‌‌ అండ్ డీకే(Raj and Dk) డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తు తం ఈ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఓ అప్‌‌‌‌డేట్ ఇచ్చింది సమంత. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌‌‌‌ ను పూర్తి చేసినట్టు చెబుతూ, కొన్ని ఫొటోస్‌ను ఆమె షేర్ చేసింది.

జులైలోనే ఈ వెబ్ సిరీస్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ను పూర్తి చేసిన సమంత.. మయో సైటిస్‌‌‌‌ కారణంగా ఆ తర్వాత కెరీర్‌‌‌‌‌‌‌‌లో బ్రేక్ తీసుకుంది. కొన్ని నెలల తర్వాత డబ్బింగ్‌‌‌‌ కోసం తిరిగి టీమ్‌‌‌‌తో జాయిన్ అయింది. ప్రియాంక చోప్రా కీలకపాత్ర పోషించిన ‘సిటాడెల్‌‌‌‌’ హాలీవుడ్‌‌‌‌ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌కు ఇది ఇండియన్ వెర్షన్‌‌‌‌. దీనికోసం మార్షల్ ఆర్ట్స్‌‌‌‌లో ట్రైనింగ్ తీసుకున్న సమంత, యాక్షన్ సీన్స్‌‌‌‌లో డూప్‌‌‌‌ లేకుండా నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌‌‌ కూడా పూర్తవుతున్నాయి కనుక త్వరలోనే ఈ వెబ్  సిరీస్‌‌‌‌ స్ట్రీమింగ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేయనున్నారు.