
సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్.. హనీ బన్నీ’. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి వెబ్ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. గురువారం స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో పాటు యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘రాత్ బాకీ.. బాత్ బాకీ’ అనే హిందీ రీమిక్స్ సాంగ్ వినిపిస్తుండగా.. యాక్షన్ విజువల్స్‌పై టీజర్‌ను కట్ చేశారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో హనీ అనే పాత్రలో సమంత, బన్నీ పాత్రలో వరుణ్ ధావన్ నటిస్తున్నారు.
ఈ సిరీస్ కోసం సమంత మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. నవంబర్ 7 నుంచి ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ లీడ్ రోల్స్‌లో రుస్సో బ్రదర్స్ తీసిన హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇది ఇండియన్ వెర్షన్. నైంటీస్ నేపథ్యంలో దీన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక ‘తుంబాడ్’ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో ‘రక్త బ్రహ్మాండ్’ అనే మరో హిందీ వెబ్ సిరీస్‌లోనూ సమంత నటిస్తోంది.