టాలీవుడ్ క్వీన్ సమంత్ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 15, 2026న విడుదల కానుంది. ఈ నేపథంలో ఈ సినిమా ప్రమోషన్లు స్పీడప్ చేశారు మేకర్స్. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసిన ఒక వినూత్న ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సమంత పచ్చడి.. సుమ సెటైర్లు!
ఈ ప్రత్యేక ప్రమోషనల్ వీడియోలో సమంతతో పాటు డైరెక్టర్ నందినీ రెడ్డి, యాంకర్ సుమ సందడి చేశారు. సమంత స్వయంగా మామిడికాయలు కోస్తూ, ఉగాది పచ్చడి తయారు చేయడం అభిమానులను మురిపిస్తోంది. అయితే, సమంత పచ్చడి కలిపే విధానంపై సుమ తనదైన శైలిలో సెటైర్లు వేయడం, దానికి సమంత ఇచ్చిన కౌంటర్లు నవ్వులు పూయిస్తున్నాయి. జీవితంలోని షడ్రుచుల ( తీపి, వగరు, చేదు, పులుపు, ఉప్పు, కారం) ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ సినిమా కూడా అన్ని ఎమోషన్లతో కూడిన ‘కంప్లీట్ ప్యాకేజీ’ అని చిత్ర యూనిట్ తెలిపింది.
క్రైమ్ యాక్షన్ డ్రామాగా..
‘ఓ బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సమంత - నందినీ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈసారి వీరిద్దరూ క్లాస్ సినిమాతో కాకుండా, ఒక ఇంటెన్స్ క్రైమ్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లో సమంత పద్ధతైన చీరకట్టులో ఉంటూనే, శత్రువుల వేటలో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం చూస్తుంటే ‘లేడీ సూపర్ స్టార్’ రేంజ్ పెర్ఫార్మెన్స్ గ్యారెంటీ అనిపిస్తోంది.
భర్త కథతో సొంత బ్యానర్‌పై..
ఈ సినిమాను సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవీస్’ (Tralala Moving Pictures) పై నిర్మిస్తోంది. నిర్మాతగా ఆమెకు ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ఇక ఈ చిత్రానికి సమంత భర్త, ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు (రాజ్ & డికె ద్వయం) కథను అందించడం విశేషం. యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్న ఈ కథ సమంత కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
