సంజోనా అంటూ కవిత్వం పండిస్తున్న తమన్నా

సంజోనా అంటూ కవిత్వం పండిస్తున్న తమన్నా

బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా భాటియా.. త్వరలో ‘ది వ్వన్‌‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆమె సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన ఈ చిత్రానికి దీపక్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నాడు. శోభాకపూర్,  ఏక్తా కపూర్‌‌‌‌ నిర్మిస్తున్నారు. టీజర్‌‌‌‌తో సినిమాపై ఆసక్తి రేపిన మేకర్స్‌‌.. తాజాగా ‘సంఝో నా’ అనే పాటను విడుదల చేశారు.  

‘‘నేను కవిని కాను కానీ.. నిన్ను చూసినప్పటి నుంచి కవితలు రాస్తున్నా.. నా కళ్లను చదివి తెలుసుకో..  అర్థం చేసుకో.. ఇది నా మనసు విన్నపం..” అనే అర్థం వచ్చేలా మనోజ్ సాహిత్యం అందించారు.  మాటల్లో చెప్పలేని మనసులోని భావాలను ప్రియురాలు అర్థం చేసుకోవాలనే ఆరాటం ఈ పాటలో కనిపిస్తోంది.  

తనిష్క్ బగ్చీ కంపోజ్ చేసిన ఈ పాటను  జూబిన్‌‌ నౌటియల్‌‌, సువర్ణ తివారీ పాడారు. తమన్నా, సిద్ధార్థ్ మల్హోత్రాల మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ, చూపుల ద్వారా ప్రేమను పంచుకునే తీరు ఆకట్టుకుంది. సెప్టెంబర్ 25న సినిమా విడుదల కాబోతోంది.