ప్రైవసీ డిస్ ప్లే, లైవ్ కాల్స్ ట్రాన్స్ లేషన్ AI ఫీచర్లతో.. సాంసంగ్ గెలాక్సీ S26 రిలీజ్

ప్రైవసీ డిస్ ప్లే, లైవ్ కాల్స్ ట్రాన్స్ లేషన్ AI ఫీచర్లతో.. సాంసంగ్  గెలాక్సీ S26 రిలీజ్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించింది  సాంసంగ్.. తన కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ గెలాక్సీ S26 ను అధికారికంగా విడుదల చేసింది. ప్రైవసీ డిస్‌ప్లే, శక్తివంతమైన AI ఫీచర్లు, మెరుగైన కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్ కస్టమర్ల ముందుకు వచ్చింది. గెలాక్సీ S26లో ఉన్న కొత్త ప్రైవసీ డిస్‌ప్లే మోడ్ ద్వారా పక్కవారు స్క్రీన్‌ను చూడకుండా నిరోధించవచ్చు. పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండేలా ఈ ఫీచర్ సహాయపడుతుంది.రియల్‌టైమ్ కాల్ ట్రాన్స్‌లేషన్, AI ఫోటో ఎడిటింగ్, ఆబ్జెక్ట్ రిమూవల్, స్మార్ట్ సమ్మరీ ,నోట్ అసిస్టెంట్,వాయిస్ కమాండ్ ద్వారా యాప్ కంట్రోల్ టూల్స్ తో ఈ AI టూల్స్ రోజువారీ వినియోగాన్ని మరింత సులభతరం చేస్తాయి.

ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్(Privacy Display Mode) .. 

ప్రైవసీ డిస్‌ప్లే ..స్క్రీన్‌ను సైడ్ యాంగిల్స్ నుంచి  చూడకుండా నిరోధించే ప్రత్యేక ఫీచర్. ఇది మెట్రో, ఆఫీస్, ఎయిర్‌పోర్ట్ వంటి  పబ్లిక్ ప్రదేశాల్లో  మీరు  ఫోన్ వాడేటప్పుడు మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షిస్తుంది.

200MP కెమెరా,  పనితీరు..

గెలాక్సీ S26లో మెరుగైన నైట్ ఫోటోగ్రఫీ, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్, శక్తివంతమైన ప్రాసెసర్ అందుబాటులో ఉన్నాయి. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో కూడా వేగవంతమైన పనితీరు అందిస్తుంది.

ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీ..

దీర్ఘకాలిక బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు, 5G కనెక్టివిటీ, సాంసంగ్ గెలాక్సీ S26 ప్రీమియం డిజైన్‌తో పాటు స్మార్ట్ టెక్నాలజీ కలయికగా కస్టమర్లను ఆకట్టుకుంటోంది. AI ఆధారిత స్మార్ట్ అనుభవం, ప్రైవసీ రక్షణ కలిపి ఈ ఫోన్‌ను మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

AI ఫీచర్లు

  • లైవ్  కాల్స్ ని ట్రాన్స్ లేషన్స్ 
  • AI ఫొటో ఎడిటింగ్, ఆబ్జక్ట్  రిమూవల్ ఫీచర్ 
  • స్మార్ట్ నోట్ , సమ్మరి అసిస్టెంట్
  • ఫోన్ కంట్రోల్ విత్ AI వాయిస్ కమాండ్స్
  • పర్సనల్ AI సజెషన్స్ ఫీచర్ 

కెమెరా స్పెసిఫికేషన్లు

  • 200MP ప్రైమరీ కెమెరా
  • 12MP అల్ట్రా వైడ్
  • 10MP టెలిఫోటో (5x ఆప్టికల్ జూమ్)
  • 8K వీడియో రికార్డింగ్
  • మెరుగైన నైట్ మోడ్ & AI ఇమేజ్ ప్రాసెసింగ్

ధర (అంచనా)

  • 12GB + 256GB : రూ. 89,999 నుంచి
  • 16GB + 512GB : రూ.99,999  వరకు