సంయుక్త డిజిటల్ డెబ్యూ .. కిరణ్ అబ్బవరంతో వెబ్ సిరీస్లోకి ఎంట్రీ

సంయుక్త డిజిటల్ డెబ్యూ .. కిరణ్ అబ్బవరంతో వెబ్ సిరీస్లోకి ఎంట్రీ

సంక్రాంతికి ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో తెలుగులో మరో విజయాన్ని అందుకున్న సంయుక్త..  ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. తను హీరోయిన్‌‌గా నటించిన  మూడు సినిమాలు రిలీజ్‌‌కు రెడీ  అవుతున్నాయి. మరోవైపు ఆమె  డిజిటల్ డెబ్యూకి కూడా రెడీ అయింది.  

‘గువ్వల చెరువు ఘాట్‌‌’ పేరుతో రూపొందుతున్న ఈ వెబ్‌‌ సిరీస్‌‌ను ఇటీవల అనౌన్స్ చేశారు. కిరణ్ అబ్బవరం, తిరువీర్‌‌‌‌ హీరోలుగా రూపొందుతున్న ఈ సిరీస్‌‌లో ఆమె హీరోయిన్‌‌గా నటిస్తోంది. ‘రాజు వెడ్స్‌‌ రాంబాయి’ ఫేమ్ తేజస్వీరావు మరో కీలకపాత్ర పోషిస్తోంది. ‘డియర్ కామ్రేడ్‌‌’ ఫేమ్ భరత్ కమ్మ ఈ వెబ్‌‌ సిరీస్‌‌కు దర్శకుడు. 

శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల విడుదలైన వీడియో గ్లింప్స్‌‌కు హ్యూజ్ రెస్పాన్స్‌‌ వచ్చింది.  రాయలసీమ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రా అండ్‌‌ రస్టిక్‌‌గా తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్‌‌ కానుంది. సంయుక్తతో పాటు కిరణ్ అబ్బవరంకు కూడా ఇదే ఫస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్‌‌. ఇక  నిఖిల్‌‌కు జంటగా సంయుక్త నటించిన ‘స్వయంభూ’, పూరి జగన్నాథ్  డైరెక్షన్‌‌లో విజయ్ సేతుపతికి జంటగా నటించిన ‘స్లమ్ డాగ్ 33  టెంపుల్ రోడ్’ చిత్రాలు త్వరలో విడుదల కాబోతున్నాయి.  అలాగే తను లీడ్ రోల్ చేసిన ‘బ్లాక్ గోల్డ్‌‌’ షూటింగ్‌‌ కూడా చివరి దశకు చేరుకుంది.