ఊరు పేరు భైరవకోనకు ప్రీమియర్స్‌‌‌‌కు పాజిటివ్ రెస్పాన్స్

ఊరు పేరు భైరవకోనకు ప్రీమియర్స్‌‌‌‌కు పాజిటివ్ రెస్పాన్స్

సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ రూపొందించిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా రెండు రోజుల ముందే ఈ మూవీ ప్రీమియర్ షోస్ వేశారు మేకర్స్. ప్రీమియర్స్‌‌‌‌కు వస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు టీమ్ గురువారం ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించింది.

సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు దాదాపు వంద ప్రీమియర్‌‌‌‌ షోలు పడ్డాయి. ప్రతి ఒక్కరి  నుంచి యునానిమస్‌‌‌‌గా పాజిటివ్ రెస్పాన్స్ రావడం హ్యాపీ. ‌‌‌‌ చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకూ చూడటానికి ఒక ఫాంటసీ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌‌‌‌‌‌‌‌ని తీశాం’ అని  చెప్పాడు. ఇది చాలా స్పెషల్ మూవీ అన్నారు హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్. ‘ప్రీమియర్స్ అన్ని షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి.  సినిమా చూసిన అందరూ అభినందించడం ఆనందాన్ని ఇచ్చింది’ అని చెప్పాడు వీఐ ఆనంద్. ప్రీమియర్స్ ఈ రేంజ్‌‌‌‌లో సక్సెస్ అవ్వడం హ్యాపీ అని నిర్మాతలు అన్నారు.