డిఫరెంట్‌‌ కాన్సెప్ట్‌‌తో సందిగ్ధం

డిఫరెంట్‌‌ కాన్సెప్ట్‌‌తో సందిగ్ధం

నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి లీడ్ రోల్స్‌‌లో, ‘తెరచాప’ ఫేమ్ నవీన్ సంకరపు విలన్‌‌గా నటించిన చిత్రం ‘సందిగ్ధం’. పార్థసారధి కొమ్మోజు దర్శకుడు. సంధ్య తిరువీధుల నిర్మించారు. 

శుక్రవారం సినిమా విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘టైటిల్ చాలా బాగుంది. అడవుల్లో ఎంతో కష్టపడి తీశారని టీజర్, ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. 

దర్శకుడు పార్ధసారథి మాట్లాడుతూ  ‘డిఫరెంట్‌‌ కాన్సెప్ట్‌‌తో ఈ చిత్రాన్ని తీశాం. కథలోని కొత్తదనం ఆకట్టుకుంటుంది. అందరూ ఎంజాయ్ చేసేలా మా సినిమా ఉంటుంది. మా సినిమాను సపోర్ట్ చేయమని ప్రేక్షకులను కోరుతున్నాం’ అని అన్నారు. మూవీ టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.