
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించారు. దర్శకులు నాగ్ అశ్విన్, మల్లిడి వశిష్ట, కళ్యాణ్ శంకర్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్‌కు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. జులై 15 నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.
ఫ్యాంటసీ, కామెడీ జానర్‌లో తెరకెక్కనున్ ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజు ఎడురోలు సినిమాటోగ్రఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా, మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.