సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దర్శకత్వంలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా సంగీత్ శోభన్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం అందర్నీ నవ్విస్తుంది. ఇందులో నాది వన్ మేన్ షో ఉంటుందో లేదో కానీ.. డైరెక్టర్ మానస శర్మది మాత్రం వన్ ఉమెన్ షోలా ఉంటుంది. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు పెట్టే టికెట్ డబ్బులకి న్యాయం చేసేలా ఉంటుంది’ అని అన్నాడు.
నిర్మాత నిహారిక మాట్లాడుతూ ‘ఈ చిత్రంతో నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాం. ఆడియెన్స్‌ను కచ్చితంగా నిరాశపర్చము’ అని చెప్పారు. తనకు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన నిహారికకు మానస శర్మ థ్యాంక్స్ చెప్పారు. నటీనటులు గెటప్ శ్రీను, రోహిణి, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్, జీ తెలుగు హెడ్ దివ్య పాల్గొన్నారు.
