ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధింపులు : నటి సంగీతపై తల్లి ఫిర్యాదు

ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధింపులు : నటి సంగీతపై తల్లి ఫిర్యాదు

కన్నతల్లిపై వేధింపులు చేస్తుందని సినీనటి సంగీతకు నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై వివరణ ఇవ్వాలని తమిళనాడు మహిళా కమిషన్ సంగీతను ఆదేశించింది.  తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నట్టు నటి సంగీతపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటి సంగీత తల్లి పేరు భానుమతి. ఈమె స్థానిక వలసరవాక్కంలో నివసిస్తున్నారు. ఆ ఇల్లు తన మామగారి నుంచి భానుమతికి వచ్చింది. ఇంట్లో కింద భాగంలో భానుమతి నివశిస్తుండగా.. పైభాగంలో నటి సంగీత, క్రిష్‌ దంపతులు ఉంటున్నారు. ఇల్లు ప్రస్తుతం నటి సంగీత పేరుతో ఉంది. ఆ ఇంటిని వదిలి వెళ్లిపోవలసిందిగా సంగీత తల్లిపై ఒత్తిడి చేస్తోందని ఫిర్యాదులో తెలిపింది భానుమతి.

సంగీత ఇంటిని తన అన్నా, తమ్ముడు అపహరిస్తారనే భయంతో తనను ఇల్లు వదిలి వెళ్లిపోమని ఒత్తిడి చేస్తోందని తెలిపింది భానుమతి. సంగీత తమ్ముడు ఆ మధ్య మరణించాడని.. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇల్లు విడిచి ఎక్కడికి పోవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది సంగీత. తాగుబోతు కుమారుడి కోసం తనను బ్లేమ్ చేసిందని చెప్పుకొచ్చింది. తన అమ్మ చెబుతున్న మాటలన్నీ అబద్దమని కొట్టిపారేసింది సంగీత.