జ్యోతిష్యం:శని త్రయోదశి..పారిజాతయోగం.. ఈరాశుల వారికి అదృష్టం వరించే టైం వచ్చేసింది..

జ్యోతిష్యం:శని త్రయోదశి..పారిజాతయోగం.. ఈరాశుల వారికి అదృష్టం వరించే టైం వచ్చేసింది..

 జ్యోతిష్యశాస్త్రంలో శని త్రయోదశికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా శనివారం రోజున త్రయోదశి తిథి రావడం ( 2026 అక్టోబర్​ 24)   చాలా అరుదుగా జరిగే యోగంగా భావిస్తారు. ఈసారి శని త్రయోదశి రోజు తులా రాశిలో సూర్యుడు, శుక్రుడు, బుధుడు కలిసి సంచరించడంతో త్రిగ్రాహి రాజ యోగం... పారిజాత యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ ప్రభావం వలన  నాలుగు రాశుల  వారికి  అన్ని విధాలా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . !

శని వారం రోజున త్రయోదశి కలసి రావడం అత్యంత శుభప్రదంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు జీవితంలో పెనుమార్పులు సంభవిస్తాయి.

 అక్టోబరు 24వ తేదీనశనివారం రోజు శని త్రయోదశిని జరుపుకుంటాం. అది కూడా శనివారం కలిసి రావడంతో నాలుగు రాశుల వారికి  భారీ శుభయోగాలు ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా శని త్రయోదశి వేళ త్రిగ్రహ రాజయోగంతో పాటు,పారిజాతయోగంలు కూడా ఏర్పడుతున్నాయి. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు ఊహించని విధంగా శుభయోగాలు కల్గుతాయి.

మేషరాశి  :  శనిత్రయోదశి తులారాశిలో త్రిగ్రాహి యోగం వలన ఈ రాశి వారికి చాలా కాలంగా పెండింగ్​ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది.  పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి అదృష్ట బలం పూర్తిగా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీస్‌లో పదోన్నతులు లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి పొదుపు చేసే అవకాశం దక్కుతుంది. ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

కన్యారాశి:  శనిత్రయోదశి వేళ త్రిగ్రాహి యోగం వలన ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.. పెళ్లిలో ఎదురౌతున్న  ఆటంకాలు దూరమౌతాయి.  నిలిచిపోయిన పనులు మళ్లీ వేగంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలపడుతుంది. . కుటుంబ సభ్యుల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన పురోగతి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది.  ఊహించని మార్గాల ద్వారా కూడా సంపద కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. లవ్ లైఫ్‌లో ఉన్న చిన్నచిన్న మనస్పర్థలు తొలగిపోతాయి.మంచి పెళ్లి సంబంధం కుదురుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

ధనస్సు రాశి:   త్రిగ్రాహి యోగం.. పారిజాత యోగం.. శని త్రయోదశి ఒకే రోజు రావడం వలన ఈ రాశి వారికి ఉత్సాహం పెరుగుతుంది.  మీ ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. మీరు తీసుకొనే వ్యూహాత్మక నిర్ణయాలు  అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కూడా నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఆర్థిక సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం చాలా మంచిది. . కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది.   కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభరాశి:  ఈ రాశి వారికి శని దేవుడు అధిపతి. త్రిగ్రాహి యోగం.. శని త్రయోదశి వలన ఈ రాశి  వారి కెరీర్​ విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కలదు. శని ప్రభావం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. గతంలో మీరుసాయంచేసిన వారంతా మీకు ధనం రూపంలో కష్టకాలంలో అండగా ఉంటారు. ఉద్యోగస్తులకు  ప్రమోషన్లు,స్థాన చలనం కలిగే అవకాశం ఉంది.  కష్టానికి తగిన ఫలితం ఉంటుంది.  ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. జీవితంలో సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. టెక్నాలజీ ...  మేనేజ్‌మెంట్‌కు రంగాలవారు బాగా  విజయం సాధిస్తారు.  ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా అనుకోని విజయాలు లభించే అవకాశం ఉంది.  చేతి వృత్తుల వారికి అనుకోకుండాఆర్డర్లు  లభిస్తాయి.ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు  అనుకూలంగా పరిష్కారం అవుతాయి. 

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 12  రాశులపై శనీదేవుడి ప్రభావం ఉంటుంది.  దీంతో మిగత రాశుల వారు శనిదేవుడికి తైలాభిషేకం, నల్లని వస్త్రాల దానం, ఉప్పు, ఇనుప వస్తువులు, నవధాన్యాలు దానంగా ఇవ్వాలి. నెయ్యి దీపారాధన, శునకాలకు, ఆవులకు ఆహర పదార్థాలు పెట్టాలి. 

చాలా మంది శనిదేవుడి ప్రభావం వల్ల కష్టాలు పడుతున్నామని చెబుతుంటారు. కానీ ఆయన మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రమే ఫలితాలను ఇస్తాడు.అందుకే మంచి పనులు చేయాలని, ఒకరి గురించి చెడు ఆలోచనలు, చెడు భావనలు చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.