Jasprit Bumrah: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-–2 సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ ఏడాది మార్చి 19వ తేదీన విడుదలఐన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ మూవీ ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సన్నీవేశం అయితే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో హీరోను చూసిన ఒకరు 'ఇంటికి రావాలనిపించలేదా జస్సీ?' అని ప్రశ్నిస్తాడు. రిసెంట్ గా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ ఈ డైలాగ్‌ను ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చింది.
తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్‌లో సంజనా ఈ ఫన్నీ మీమ్ షేర్ చేస్తూ.. పెళ్లైన తర్వాత మగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఫన్నీగా చెప్పుకొచ్చింది. బుమ్రా తన స్నేహితులతో కలిసి బాయ్స్ నైట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్న ప్రతిసారీ అతడికి ఎదురయ్యే పరిస్థితిని ఈ మీమ్‌తో ఆమె పోల్చింది. ధురంధర్– 2 సినిమాలో పిండా పాత్ర చేసిన ఉదయ్‌బీర్ సంధుకు ఒక విగ్గు పెట్టి మరీ.. నీకు ఇల్లు గుర్తుకు రాలేదా జస్సీ? అని తాను అడిగినట్లు ఈ మీమ్ ని సంజనా క్రియేట్ చేసింది.
►ALSO READ | MS Dhoni: వయస్సే పెరిగింది.. పస తగ్గలేదు.. మైదానంలో ధోనీ సిక్సర్ల వర్షం!
కాగా తన బుమ్రా ఎప్పుడైనా ఇల్లు వదిలి ఫ్రెండ్స్‌తో పార్టీ ప్లాన్ చేస్తే, నేను ఈ డైలాగ్‌తోనే పంచ్ వేస్తానని సంజనా గణేశన్ స్మైల్ ఎమోజీలతో ఫన్నీగా పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఒక యూజర్ కూడా ఈ డైలాగ్‌తో కూడిన రీల్‌ను షేర్ చేశాడు. అందులో సదరు వ్యక్తి దీపికా పదుకొణె, అలియా భట్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, రష్మిక మందన్న, కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లను అనుకరిస్తూ, ఒకే డైలాగ్‌ను చమత్కారంగా చెప్పుకొచ్చాడు.
Sanjana Ganesan be like: Trend ko follow karne ka! 😂👌
— OneTurf News (@oneturf_news) March 25, 2026
📸: Sanjana Ganesan/IG#oneturfnews #jaspritbumrah #sanjanaganesan #dhurandhar #cricket pic.twitter.com/OdNRnHa4TT
