సంజయ్ రావ్ హీరోగా సాయి కృష్ణ సాగర్ దర్శకత్వంలో సతీష్ రెడ్డి అల్లం, కె.శేఖర్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం సంజయ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘హిట్ అండ్ రన్’ అనే టైటిల్‌ను ప్రకటించారు.
ఈ పోస్టర్‌లో సంజయ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తూ ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. నటాషా సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవి ప్రకాష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఈ సినిమాకి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్నాడు.
