సెప్టెంబర్లో సంజు లైఫ్

సెప్టెంబర్లో సంజు లైఫ్

శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ జంటగా  నిశాంత్ దోటి దర్శకత్వంలో  తేజేశ్వర్ వెల్పుచర్ల  నిర్మించిన  చిత్రం ‘సహ : లైఫ్ ఆఫ్ సంజు’. సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.   ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హీరో హీరోయిన్  పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ జర్నీలో ఆత్మీయంగా కనిపించారు. 

ఈ విజువల్ ఇద్దరి మధ్య ప్రేమ, అనుబంధాన్ని సహజంగా చూపిస్తూ సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచుతోంది.  సంజు జీవితంలోని వివిధ దశలను ఈ సినిమా ప్రజెంట్ చేస్తుందని మేకర్స్ తెలియజేశారు.   ప్రేమ, విడిపోవడం, మధురమైన జ్ఞాపకాలు, కష్టాలను అధిగమించేందుకు అవసరమైన మనోధైర్యం వంటి అంశాలను చూపించనున్నామని అన్నారు. 

ఇందులోని పాత్రలు ప్రతి ఒక్కరికీ ఎమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దగ్గరవుతాయని చెప్పారు.  ఈ చిత్రంలో వ్రజనా పాండ్యా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘన సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.