టాలీవుడ్‌లో 'సంక్రాంతి 2024' సినిమాల రేసు..

టాలీవుడ్‌లో 'సంక్రాంతి 2024'  సినిమాల రేసు..

సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యే సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు.ఈ పొంగల్ సీజన్ నిర్మాతలకు ప్రధాన వ్యాపార సీజన్లలో ఒకటి. ఈ ఏడాది పొంగల్ లో రిలీజైన చిరంజీవి(Chiranjeevi)  వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కాగా బాలకృష్ణ(Balakrishna)  వీరసింహా రెడ్డి సూపర్ హిట్ అయింది.

ప్రస్తుతం 2024 పొంగల్ చూస్తే భారీ వెయిట్‌లిస్ట్ ఉంది. ప్రభాస్(Prabhas) ప్రాజెక్ట్ K జనవరి 12, 2024న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా క్రీయేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma)  హనుమాన్  చిత్రం కూడా అదే రోజున విడుదల కానుందని టీం తెలిపింది. 

ఈ మూవీస్ తో పాటు సూపర్ హిట్ కాంబో విజయ్ దేవరకొండ-(Vijay Devarakonda) పరశురామ్( Parushuram)  సినిమాను విడుదల చేసేందుకు దిల్ రాజు(Dil Raju)  ప్లాన్ చేస్తున్నారు. రవితేజ(RaviTeja) యొక్క ఈగల్ మూవీ కూడా సంక్రాంతికి కానుంది. కళ్యాణ కృష్ణ(Kalyan Krushna)తో చిరంజీవి తదుపరి చిత్రాన్ని కూడా అదే సీజన్‌లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. 

నాని(Nani) 30 మూవీ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఒకవేళ వాయిదా పడితే సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలే. వీటితో పాటు త్రివిక్రమ్(Trivikram), మహేష్ బాబు(Mahesh Babu)  గుంటూరు కారం మూవీ కూడా పొంగల్ కు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.