విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇందులో జాక్ రెడ్డి అనే వైవిధ్యమైన పాత్రను పోషించాడు. శుక్రవారం సినిమా విడుదలవుతోంది.
రీసెంట్‌గా ప్రివ్యూ చూసిన తరుణ్ భాస్కర్... సంతాన లేమి అనే సమస్యను ఎంటర్‌టైనింగ్‌గా, ఎమోషనల్‌గా చెప్పడం చాలా కష్టమని, ఈ మూవీ టీమ్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘ఇదొక డీసెంట్ మూవీ. చాలా సరదాగా ఉంది. నేను పోషించిన జాక్ రెడ్డి లాంటి పాత్రలను మన నిజ జీవితంలోనూ చూస్తుంటాం. పైకి టఫ్‌గా కనిపిస్తారు కానీ లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి చాలా క్లారిటీతో ఈ సినిమాను రూపొందించాడు. మన ఇంట్లో తెలుగు మీల్స్ తిన్నట్టుగా సంతృప్తిగా అనిపించింది’ అని చెప్పాడు.
