OTT Horror Review: హిట్ ఫ్రాంచైజీలో మరో హారర్.. దెయ్యాల గదిలో మాయా డైరీ.. కట్టిపడిసే థ్రిల్లర్

OTT Horror Review: హిట్ ఫ్రాంచైజీలో మరో హారర్.. దెయ్యాల గదిలో మాయా డైరీ.. కట్టిపడిసే థ్రిల్లర్

తమిళ ఇండస్ట్రీలో స్టార్ కెమెడియన్గా కొనసాగుతున్నారు నటుడు సంతానం. తనదైన నటనతో ఆడియన్స్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ ఫేమ్తోనే ఈ మధ్యే హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. అలా పలు సినిమాల్లో కూడా నటించాడు.

సంతానం ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ (Devils Double Next Level). క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ S. ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇది ‘దిల్లుకు దుడ్డు’ ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా ఈ మూవీ తెరకెక్కింది.

ఈ మూవీ 16 మే 2025న థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంది. కామెడీ హార‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ ఎంటర్ టైన్ అవ్వడంతో పాటు ఉత్కంఠ ఫీల్ అయ్యారు. 'దెయ్యాల ఉచ్చులు, భయానక సన్నివేశాలు, పేరడీ హాస్యం' ఇలా పలు అంశాలతో వచ్చి థ్రిల్ ఇచ్చింది. ఇపుడీ ఈ సూపర్ నేచులర్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.

డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ ఓటీటీ: 

డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ మూవీ జూన్ 13నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జీ5లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్నీ మేకర్స్ నేడు (జూన్10న) అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే, జీ5 ఓటీటీలో అదిరిపోయే సినిమాలున్నాయి. ఈ వీకెండ్ స్టార్టింగ్ లోనే అడ్వెంచర్ హార్రర్ కామెడీ జోనర్లో సినిమా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

కథేంటంటే:

కృష్ణమూర్తి "కిస్సా" అనే వ్యక్తి యూట్యూబ్ రివ్యూవర్. త‌నదైన వాక్ చాతుర్యంతో సినిమాల‌కు రివ్యూలు ఇస్తుంటాడు. ద‌ర్శ‌కుడు హిచ్‌కాక్ ఇరుద‌య‌రాజ్(సెల్వ‌రాఘ‌వ‌న్‌) కు, కిస్సాకు ఏ మాత్రం పడదు. ఒకరోజు హిచ్‌కాక్ లేటెస్ట్ హర్రర్-కామెడీ మూవీ, డిడి నెక్స్ట్ లెవెల్ ప్రైవేట్ స్క్రీనింగ్‌కు అటెండ్ కావడానికి ఆహ్వానం అందుకుంటాడు కిస్సా. అంటే, కిస్సా ఒక్కడికే రహస్య స్క్రీనింగ్ ఏర్పాటు చేసానని హిచ్ కాక్ చెబుతాడు.

అయితే, ఇది మరొక పబ్లిసిటీ స్టంట్ అని కిస్సా భావించి, తన కుటుంబం మరియు స్నేహితురాలు ఆసై హర్షినితో కలిసి వెళ్లడానికి రెడీ అవుతాడు. కానీ, కిస్సాకు తెలియకుండానే తన కుటుంబం, ఇప్పటికే థియేటర్‌కి వెళ్ళిందని అతనికి సమాచారం అందుతుంది. అలా, తానొక్కడే థియేటర్ కి వెళతాడు. ప్రొజెక్ట‌ర్ ఓసారి ఆన్ కాగానే, కిస్సా ప్ర‌పంచం ఒక్క‌సారిగా త‌ల‌కిందులుగా మారుతుంది. దెయ్యాలు, భూతాలు ఉండే క్రూయిజ్‌లో క‌న్ను తెరుస్తాడు.

ఇదే క్రమంలో మరో ఇద్దరు యూట్యూబ్ ఫిల్మ్ రివ్యూవర్స్.. వీన్ పెచ్చు బాబు మరియు వీన్ పెచ్చు మణి కూడా రహస్యంగా థియేటర్‌కి వస్తారు. వారు ఏదో విధంగా కిస్సా పాస్ గురించి తెలుసుకుంటారు. అలా వారు కూడా ప్రత్యేక స్క్రీనింగ్‌ను చూడాలనుకుంటున్నారు. లోపలికి వెళ్లేసరికి థియేటర్ హాల్ తలుపు మూసుకుపోతుంది. ఆపై ఆ ముగ్గురూ ఒక దెయ్యం క్రూయిజ్ షిప్ లోపల చిక్కుకుంటారు. కిస్సా గ‌ర్ల్‌ఫ్రెండ్ కూడా ఓ ఆత్మ‌గా మారిపోయుంటుంది. అక్కడ మొదలవుతుంది అసలు కథ. ఈ క‌థాగ‌మ‌నంలో హాస్యంతో నిండిన మ‌లుపులు, రోల‌ర్ కోస్ట‌ర్‌లాగా అనిపించే స‌న్నివేశాలతో నిండి ఉంటాయి. 

అక్కడ క్రూయిజ్ షిప్లో ఓ డైరీ ఉంటుంది. అందులో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. వారు డైరీలో విష‌యాల‌ను డీకోడ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతారు. ముగింపు మాత్రం.. పాజిటివ్ క్రెడిట్స్ వచ్చే వరకు.. బతికి ఉంటేనే వారు తప్పించుకోగలరు. అంతేకాదు.. కిస్సా అతీంద్రియ శక్తులను అధిగమించాలి. వాటి బ‌ల‌హీన‌త‌లు గుర్తించాలి. నిగూఢమైన పజిల్స్ సాల్వ్ చేయాలి కూడా. ఎందుకంటే..ఇది ద‌ర్శ‌కుడు హిచ్‌కాక్ ప్రతీకారంతో కూడుకున్నది.

మరి ఇంతకు హిచ్‌కాక్ పగ ఏంటీ? ఎందుకిలా చేస్తున్నాడు? ఓ సినిమా రివ్యూవ‌ర్ లైఫ్.. ఒక రివ్యూతో ఎలా మారిపోయింది? చివరికి ఇదొక మాయా డైరీ అని ఎలా తెలుస్తోంది? డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్ వెనుక ఉన్న థీమ్ ఏంటీ? అనేది మిగతా స్టోరీ!