ధురంధర్‌ జోష్తో టాలీవుడ్లో మ్యాజిక్ చేసేందుకు వస్తున్న సారా అర్జున్

ధురంధర్‌ జోష్తో టాలీవుడ్లో మ్యాజిక్ చేసేందుకు వస్తున్న సారా అర్జున్

‘ధురంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫ్రాంచైజీతో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ ఇచ్చిన  సారా అర్జున్‌‌‌‌‌‌‌‌.. ఫస్ట్ అటెంప్ట్‌‌‌‌‌‌‌‌లోనే వరుస ఇండస్ట్రీ హిట్స్‌‌‌‌‌‌‌‌ అందుకుంది. బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ బాక్సాఫీస్‌‌‌‌‌‌‌‌ దగ్గర బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకున్న ధురంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ధురంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 చిత్రాలు ఓటీటీలోనూ మిలియన్ల వ్యూస్‌‌‌‌‌‌‌‌తో దూసుకెళ్తున్నాయి. దీంతో అటు బాలీవుడ్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇటు సౌత్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆమెకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.  

అయితే సారా మాత్రం సెలెక్టివ్‌‌‌‌‌‌‌‌గా ముందుకెళ్తోంది.  ఇదిలా ఉంటే.. గతంలో ఆమె హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన తెలుగు చిత్రం ‘మ్యాజిక్‌‌‌‌‌‌‌‌’ ఇప్పుడు రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతోంది.  జెర్సీ, కింగ్‌‌‌‌‌‌‌‌డమ్ చిత్రాల దర్శకుడు గౌతమ్‌‌‌‌‌‌‌‌ తిన్ననూరి దీనికి దర్శకుడు. సితార ఎంటర్‌‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది.  హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా సారా తెలుగులో సైన్ చేసిన తొలి సినిమా ఇది. 

 కాలేజ్‌‌‌‌‌‌‌‌ ఫెస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే న్యూ ఏజ్ మ్యూజిక‌‌‌‌‌‌‌‌ల్ డ్రామా ఇది. కోలీవుడ్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌‌‌‌‌‌‌‌ సంగీతం అందించాడు.  రెండేళ్ల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది.  ఇప్పుడీ చిత్రాన్ని డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఓటీటీలో రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సారా అర్జున్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆకాష్ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, అన్‌‌‌‌‌‌‌‌మోల్‌‌‌‌‌‌‌‌, సిద్ధార్థ్ త‌‌‌‌‌‌‌‌ణుకు ఇందులో ప్రధానపాత్రలు పోషించారు. గుణశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసిన ‘యుఫోరియా’ చిత్రంలోనూ సారా నటించిన విషయం తెలిసిందే.