తెలంగాణ నేపథ్యంలో సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలు లాంటి అంశాలతో రూపొందిస్తున్న చిత్రం ‘సర్కారు బాయి’. శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా లారా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా హాజరై మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. సామాజిక అంశాలతో కూడిన కథతో పరిచయం అవడం సంతోషంగా ఉందని హీరోహీరోయిన్స్ చెప్పారు.
దర్శకుడు లారా మాట్లాడుతూ “ఎయిటీస్‌లో తెలంగాణలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, కుల వివక్ష, సామాజిక అసమానతల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అణగారిన వర్గాలకు నీళ్లు ఇవ్వకుండా జరిగిన అన్యాయాలు, వారు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీటి గాథ ఈ చిత్రానికి మూలం. ప్రేక్షకుల ఆదరణ కోరుకుంటున్నాం” అని తెలిపారు. నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, నటులు చిట్టిబాబు, మోహన్ బైరాగి, తదితరులు పాల్గొన్నారు.
