సశస్త్ర సీమ బల్‌లో కానిస్టేబుల్ జాబ్స్

సశస్త్ర సీమ బల్‌లో కానిస్టేబుల్ జాబ్స్

​న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్, సశస్త్ర సీమ బల్‌(ఎస్‌ఎస్‌బీ) 2023 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటాలో 272 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత : పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 

సెలెక్షన్​ ప్రాసెస్​: క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో లేదా భారత భూభాగం వెలుపల సేవలు అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.ssb.com వెబ్​సైట్​లో సంప్రదించాలి.