మైత్రీ మూవీస్ రిలీజ్ చేస్తోన్న శశివదనే

మైత్రీ మూవీస్ రిలీజ్ చేస్తోన్న శశివదనే

రక్షిత్ అట్లూరి, కోమలీ జంటగా సాయి మోహన్ ఉబ్బర రూపొందించిన చిత్రం ‘శశివదనే’. అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు. ఏప్రిల్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాని  నైజాంలో  మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌‌ఎల్‌‌పి సంస్థ రిలీజ్ చేస్తోందని శనివారం ప్రకటించారు.  

విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది.  ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. శరవణన్ వాసుదేవన్ సంగీతం అందించాడు.