‘బాహుబలి’ సినిమాలో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు సత్యరాజ్ కూతురు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ దివ్య సత్యరాజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆమె వ్యక్తిగత జీవితంపై నెట్టింట గత కొన్ని రోజులుగా షాకింగ్ రూమర్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. దివ్య ఒక వ్యక్తితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడంతో.. ఆమె ఎవరికీ తెలియకుండా 'సీక్రెట్ మ్యారేజ్' చేసుకుందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది.
బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని పెళ్లి చేసుకుంటారా?
ఈ రూమర్లపై దివ్య సత్యరాజ్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. హిల్ స్టేషన్‌లో నేను బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని ఒక వ్యక్తి పక్కన నిలబడిన ఫోటోను పెళ్లి ఫోటో అంటున్నారు. అసలు ఎవరైనా నల్ల అద్దాలు పెట్టుకుని పెళ్లి చేసుకుంటారా? ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు, అది పూర్తిగా AI సృష్టించిన మాయ అంటూ కొట్టిపారేశారు. ఇక నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 'నాకు రెండు పెళ్లిళ్లు, ముగ్గురు పిల్లలంట' అంటూ సెటైరికల్‌గా నవ్వేశారు.
కుమార్తెకు మద్దతుగా..
ఈ వివాదంపై సత్యరాజ్ కూడా సీరియస్‌గా స్పందించారు. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ.. నా కుమార్తె దివ్యపై వస్తున్న రూమర్లలో ఎలాంటి నిజం లేదు. తను ఎంతో కష్టపడే స్వభావం ఉన్న, గౌరవప్రదమైన స్వయంకృషి గల మహిళ. తండ్రిగా నా కూతురిని చూసి ఎంతో గర్వపడుతున్నాను అంటూ మద్దతుగా నిలిచారు. అయితే, ఈ వైరల్ ఫోటోల వెనుక అసలు నిజం వేరే ఉంది. అవి నిజమైన ఫోటోలు కావు.. కేవలం AI సాయంతో క్రియేట్ చేసిన ఫేక్ ఇమేజెస్ అని మండిపడ్డారు.
పెళ్లి లేకుండానే పిల్లలు..
గతంలోనూ దివ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల్ని కనడానికి పెళ్లి చేసుకోవాలనే రూల్ నేను నమ్మను. వివాహం లేకుండానే తల్లిని కావడానికి నేను సిద్ధం అని ప్రగతిశీల ఆలోచనలను పంచుకున్నారు. దీనిపై సత్యరాజ్ స్పందిస్తూ.. తాను సామాజిక సంస్కర్త 'పెరియార్' సిద్ధాంతాలను నమ్ముతానని, ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో పిల్లల కోసం పెళ్లి అనేది వ్యక్తిగత నిర్ణయమని చెప్తూ కూతురి బోల్డ్ స్టేట్‌మెంట్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఫేక్ న్యూస్ క్రియేటర్లకు కట్టప్ప ఫ్యామిలీ గట్టి కౌంటర్ ఇచ్చేసింది.
