కొత్త లోకానికి తీసుకెళ్లే పొలిమేర 2

కొత్త లోకానికి తీసుకెళ్లే  పొలిమేర 2

సత్యం రాజేష్  లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. కామాక్షి భాస్కర్ల హీరోయిన్.   గౌరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా నవంబర్ 3న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్రంలోని పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. సినిమాలో కనిపించే గెటప్‌‌‌‌లో  కార్యక్రమానికి హాజరైన సత్యం రాజేష్​  ‘కొత్త కాన్సెప్ట్‌‌‌‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల‌‌‌‌ను కొత్త లోకానికి తీసుకువెళుతుంది’ అన్నాడు.

ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉందని చెప్పింది కామాక్షి భాస్కర్ల.  ‘చిన్నగా  మొద‌‌‌‌లుపెట్టిన ఈ సినిమాకు ఇంత బ‌‌‌‌జ్ రావ‌‌‌‌డం ఆనందంగా ఉంది. త్వరలో పొలిమేర 3 కూడా మొదలు పెడతాం’  అని దర్శకుడు అనిల్ చెప్పాడు.  కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు నందిపాటి వంశీ. బాలాదిత్య, రాకేందు మౌళి, గ్యానీ, కెమెరామెన్ ఖుషేంద‌‌‌‌ర్ రెడ్డి పాల్గొన్నారు.