సవారి డైరెక్టర్.. పొట్టెల్ ఇంపాక్ట్ వీడియో అదిరిపోయింది

సవారి డైరెక్టర్.. పొట్టెల్ ఇంపాక్ట్ వీడియో అదిరిపోయింది

గీతామాధురి భర్త నందు హీరోగా సవారి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సాహిత్ మోత్కూరి (Sahitmothkhuri). ఫస్ట్ మూవీతోనే మంచి కంటెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సాహిత్..మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ పొట్టెల్ (Pottel). ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్ ను ఆసక్తిగా డిజైన్ చేశారు మేకర్స్. రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై విలేజ్ కల్చర్ ను..సాంప్రదాయక పద్దతులను చూపించేలా ఉంది. 

అంతేకాకుండా..బోనాల పండుగ జాతరలో హీరో చేతిలో పొట్టెల్..అమాయక ముఖంతో హీరోయిన్ అనన్య..తన పాప చేతిలో పలక ఆసక్తిగా ఉంది. ఊర్లో అమ్మవారి ముందు బలిచ్చే పొట్టేలును..ఎంత సాప్రదాయకంగా రెడీ చేస్తారో..అప్పుడు ఊర్లో  భోగినీలు పాడే పాటతో గూజ్ బంప్స్ వచ్చేలా టీజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. మోషన్ టీజర్ లో శేఖర్ చంద్ర మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలెట్ గా నిలిచింది. 

ఎన్ ఐ ఏ ఎంటర్టైన్మెంట్స్ నిశాంత్ రెడ్డి, కుడికి ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్ సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా పొట్టెల్ మూవీని  నిర్మిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా ప్రయాణం కొనసాగిస్తూ..వరుస సినిమాలు చేస్తోన్న సాహిత్ ఈ సినిమాతో హిట్ తెచ్చుకోవడం కన్ఫమ్ అనేలా టీజర్ చూస్తే అర్ధం అవుతోంది.