మార్చి 15 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ కానున్న సేవ్‌‌‌‌ ద టైగర్స్‌‌‌‌ 2

మార్చి 15 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ కానున్న సేవ్‌‌‌‌ ద టైగర్స్‌‌‌‌ 2

ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధానపాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్‌‌‌‌ ‘సేవ్ ద టైగర్స్‌‌‌‌ 2’. మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేటర్స్‌‌‌‌గా వ్యవహరించగా, అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించాడు.  శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దర్శన బానిక్, హర్ష వర్థన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

ఈ నెల 15 నుంచి ఇది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది. శనివారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఫ్యామిలీ లైఫ్‌‌‌‌లో విసిగిపోయిన భర్తలుగా ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ తమ ఫ్రస్ట్రేషన్‌‌‌‌తో నవ్వించారు. ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యే క్రమంలో హంసలేఖ మిస్సింగ్ కేసులో ఇరుక్కోవడం ఆసక్తికరంగా ఉంది. ఆ కేసు నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేది మిగతా కథ. ‘ఫస్ట్ సీజన్‌‌‌‌కు మించిన హ్యూమర్, సస్పెన్స్, ఫన్‌‌‌‌ను సీజన్ 2లో అందించబోతున్నాం’ అని షో క్రియేటర్ మహీ వి రాఘవ్ అన్నారు.