ఖమ్మం పట్టణంలోని స్మార్ట్ కిడ్స్ స్కూల్ లో బోనాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పిల్లలకు బోనాల విశిష్టతను తెలియజెప్పాలన్న ఉద్దేశంతో స్కూల్ లో శుక్రవారం బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు స్టూడెంట్లు అమ్మవారి, పోతరాజుల వేషధారణలో ఆకట్టుకోగా, మరికొందరు చిన్నారులు బోనాలు ఎత్తుకుని నడిచారు.
