తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రభుత్వ స్కూల్స్క ఇచ్చిన స్టూడెంట్స్ యూనిఫామ్స్ చెత్తకుప్పల్లో దర్శ నమిచ్చాయి. తాండూరు శివారు బైపాస్ దగ్గర రెండు సంచుల్లో స్కూల్యాూనిఫామ్స్ ఉండడాన్ని శుక్రవారం ఉదయం స్థానిక లెఫ్ట్ పార్టీల లీడర్లు చూశారు. రెండు సంచుల్లో సుమారు 150 జతల యూనిఫామ్స్ ఉన్నాయనిచెప్పారు.
స్టూడెంట్స్ కు ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాందజేస్తోంది. అయితే, విద్యార్థులకు ఇవ్వకుండా మిగిలి పోయిన డ్రెస్సులను పడేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఎంఈవోకు కాల్చేయగా స్పందించలేదు.
