జ్యోతిష్యం: సెప్టెంబర్లో గ్రహాల మార్పు.. వృశ్చికరాశి వారికి లక్ష్మీదేవి తలుపు తడుతుంది..!

జ్యోతిష్యం:  సెప్టెంబర్లో  గ్రహాల మార్పు.. వృశ్చికరాశి వారికి లక్ష్మీదేవి తలుపు తడుతుంది..!

జ్యోతిష్యం ప్రకారం 2026 సెప్టెంబర్​ నెల వృశ్చిక రాశి వారికి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.  ఈ నెలలో భారీగా గ్రహాలు మారనునన్నాయి.  దీని ప్రభావం వలన ఈ నెల ( సెప్టెంబర్​​ 2026) వృశ్చిక రాశివారికి ఎలా ఉంటుంది.. ఆర్థిక స్థితిగతులపై గ్రహాల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది.. సుఖ సంతోషాలు ఎలాఉంటాయి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

సెప్టెంబర్​​ నెల (2‌026)  గ్రహాల మార్పు వివరాలు ..

  • సెప్టెంబర్ 2:   తులా రాశిలోకి శుక్రుడు
  •  సెప్టెంబర్ 7: కన్యారాశిలోకి బుధుడు 
  •  సెప్టెంబర్ 17:   కన్యారాశిలోకి  సూర్యుడు
  •  సెప్టెంబర్ 18:  కర్కాటక రాశిలోకి కుజుడు 
  •  సెప్టెంబర్ 26: తులా రాశిలోకి  బుధుడు 

ఈ నెలంతా (సెప్టెంబర్​​ 2026) వృశ్చిక రాశి వారికి  సానుకూలంగా గడిచిపోతుంది.  ధన స్థానంలో శుక్రుడి శుభ దృష్టి వలన  జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఈ నెలలో కీలక గ్రహాల సంచారం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రాశి వారి వ్యక్తిగత జీవితంలో కొత్త మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది.  

వృశ్చిక రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి .. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని పండితులు చెబుతున్నారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. . మీరు పడే శ్రమకు అదృష్టం కూడా తోడై లాభాలను తెచ్చిపెడుతుంది.అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. 

విదేశీ సంబంధమైన విషయాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. స్వల్ప ప్రయత్నంతో అధిక లాభాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని పండితులు సూచిస్తున్నారు. 

ఉద్యోగ జీవితం సాఫీగా, ప్రశాంతంగా పురోగమిస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు అంది వస్తాయి. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు ఆర్థిక సహాయం చేయడం కూడా జరుగుతుంది. స్నేహితుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. విద్యార్థులు తేలికగా విజ యాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ఇంట్లో ముఖ్యమైన సౌకర్యాలన్నీ అమరుతాయి. దైవ కార్యాలు, శుభ కార్యాల మీద ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

పరిహారాలు:  దక్షిణామూర్తి స్తోత్రం చదవడం.. గురువారాలు గోమాతకు ఆహారం ఇవ్వడం

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.