స్మగ్లర్లు చిత్ర విచిత్రమైన మార్గాల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటారు. అయితే ఎంత జాగ్రత్తగా డ్రగ్స్ సరఫరా చేసినా..ఎక్కడో ఓ చోటు దొరికిపోతుంటారు. తాజాగా న్యూజిలాండ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఓ వృద్ద దంపతులు అడ్డంగా దొరికిపోయారు.
స్కాట్లాండ్‌లో ఓ వృద్ధ దంపతులు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు. గొర్రెపిల్ల సాయంతో పది లక్షల విలువైన డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తూతో పట్టుబడ్డారు. ఈ జంట 10 లక్ష విలువైన డ్రగ్స్‌తో గొర్రెపిల్లను కారులో తీసుకెళ్లారు.
గొర్రె పిల్ల సాయంతో డ్రగ్స్ స్మగ్లింగ్
ఏప్రిల్ 22న స్కాంట్లాండ్ లోని ఎం74 హైవేపై వృద్ధ దంపతులు కారులో వెళ్తుండగా పోలీసులు వారిని ఆపారు. అనంతరం తనిఖీ చేయగా కారు వెనుక సీటులో గొర్రెపిల్ల కనిపించింది. ఆ వృద్ద దంపతులు గొర్రె పిల్లతో ఆడుకోవడాన్ని పోలీసులు గమనించారు. అక్కడే చిప్స్ ప్యాకెట్ కూడా కనిపించింది. కానీ పోలీసులతో ఉన్న కుక్క పదేపదే కారు వెనుకసీటునే అనుమానంగా చూసింది. అయితే మొదట గొర్రెపిల్లపై కుక్క దాడి చేస్తుందని భావించిన పోలీసులు...ఆ తరువాత దంపతులపై అనుమానం వ్యక్తం చేశారు. వెనుక సీటును క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. 10 లక్షల విలువైన డ్రగ్స్ ప్యాకెట్ లభించింది.
స్మగ్లర్లు అరెస్టు
డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు..వృద్ధ దంపతులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏడు లక్షల విలువైన హెరాయిన్, మూడు లక్షల విలువైన కొకైన్ లభ్యమయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు ఆన్‌లైన్‌లో పలు విషయాలను వెల్లడించారు. ఈ దంపతులు గొర్రెపిల్ల ఆధారంగా ఒక మిలియన్ విలువైన డ్రగ్స్ ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారో వివరించారు. వాహనాల తనిఖీ సమయంలో పోలీస్ జాగిలం లేకపోతే ఈ స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి తమ డ్రగ్స్ ను యధేచ్చగా సరఫరా చేసేవారు. ఇద్దరి వయసు యాభై పైనే ఉంటుంది. దంపతులను జైలుకు పంపిన తర్వాత గొర్రెపిల్లను స్థానిక రైతు వద్దకు తీసుకెళ్లారు.