జామ్ జామ్ జజ్జనక.. గెట్ రెడీ ఫర్ మెగా పార్టీ

జామ్ జామ్ జజ్జనక.. గెట్ రెడీ ఫర్ మెగా పార్టీ

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్(Bhola Shankar). టాలెంటెడ్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసేందుకు టైం ఫిక్స్ చేశారు. "జామ్ జామ్ జజ్జనక" అంటూ సాగే పాటకు సంబందించిన ప్రోమోను జులై 9న సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఇక ఫుల్ సాంగ్ జులై 11న రానుంది.  దీనికి సంబంధించిన అప్డేట్ ఇస్తూ.. మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. 

ఈ పోస్టర్ లో చూరు స్టైలీష్ డాన్స్ పోజ్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ కు కిక్కిస్తున్నారు. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రరెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా నుండి రిలీజైన్ భోళా మేనియా అనే సాంగ్.. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. అలాగే భోళా శంకర్ టీజర్ కు కూడా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ టీజర్ లో మెగాస్టార్ స్వాగ్, మ్యానరిజమ్స్ నెక్స్ట్ లెవల్లో సెట్ అయ్యాయని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకునేందుకు యూనిట్ తెగ కష్టపడుతున్నారు.

ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో.. తమన్నా(Thamannah) హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరు చెల్లిగా మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) నటిస్తోంది. సుశాంత్(Sushanth)మరో కీలకపాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా.. తమిళ హిట్ సినిమా వేదాళం(Vedalam) సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే.