శివమొగ్గ: కర్ణాటకలో ఘోరం జరిగింది. ఆయుధ పూజ రోజున కొత్త కారు కొనుగోలు చేసిన ఒక వ్యక్తి కారు షోరూం నుంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో యాక్సిడెంట్ చేశాడు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగరలో ఈ ఘటన జరిగింది. షోరూమ్ నుంచి కారును డెలివరీ తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
#BREAKING Seconds after delivery, a brand-new car crashed through a showroom barricade in Sagara, Shivamogga, hitting a bike on the main road and injuring two people. #Sagara #Shivamogga #RoadSafety @KarnatakaPolice @ShivmogaPolice https://t.co/5SYwi554a7
— jarvis ☠️ (@Vishii14) October 20, 2026
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు నేరుగా రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు రోడ్డు మీద వెళుతున్న బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సాగరలోని మారుతి కార్ షోరూమ్ దగ్గరలో ఈ ఘటన జరిగింది. షోరూమ్ ముందున్న బారికేడ్‌ను ఢీకొట్టి, ఆపై రోడ్డులో కారు దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం జరిగింది.
ఈ సమయంలో రోడ్డుపై వెళుతున్న బైక్ ను కారు ఢీకొట్టింది. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు షోరూమ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారు నడపడం రాకుండానే కారు కొనడం, ఇలా యాక్సిడెంట్స్ చేయడం ఏంటని నెటజిన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సాగర టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
