నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిన స్పై థ్రిల్లర్ ‘సీక్రెట్ సోల్జర్’. సెప్టెంబర్ 18న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన దర్శకులు శైలేష్ కొలను, బీవీఎస్ రవి సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.
ఈ సందర్భంగా నిహాల్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో ఉన్న పాయింట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చిన్న సినిమా అనుకున్నవారంతా.. ఇదొక పెద్ద సినిమాగా భావిస్తారు’ అని అన్నాడు. ఈ సినిమాలో యాక్షన్, హ్యూమర్ అన్నిటికంటే మించి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది అని సూర్య శ్రీనివాస్ అన్నాడు. డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ ‘అందరూ గర్వపడే సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పాడు. నటులు కమల్ కామరాజు, శాన్వి, దీక్షా పంత్, హర్షిత, శ్రీష సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
