జనగామలో 14 వేల మందికి 'సర్' నోటీసులు

జనగామలో 14 వేల మందికి 'సర్' నోటీసులు

జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో సర్ నోటీసులు ప్రక్రియ సాగుతోంది. ఇటీవల ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్​పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో 7,03,691 ఓట్లు ఉన్నాయి.

వీరిలో 1,34,392 ఓటర్ల పేర్లలో అక్షర దోషాలు, ఇతర పొరపాట్లు ఉన్నాయి. 29,498 మంది ఓటర్లు మ్యాపింగ్​ కాలేదు. దీంతో 1,63,890 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టింది.

ఓటర్ల నోటీసులు జనరేట్ చేసినా వారికి అందించడంలో కాస్తా ఆలస్యమే అవుతోంది. ఇప్పటివరకూ 14 వేల మందికి బీఎల్​వోలు నోటీసులు అందించారు. ఇంకా 1.50 లక్షల మందికి నోటీసులు అందించాల్సి ఉంది. నోటీసుల్లో పేర్కొన్న తేదీల్లో ఓటర్లు హియరింగ్ హాజరై తమ వద్ద ఉన్న ఆధారాలు చూపించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఫైనల్​ ఓటర్ లిస్ట్లో పేరు తొలగిస్తారు.