Fire accident : వేడి తగ్గించేందుకు ఫోమ్ కొడుతున్న సిబ్బంది

Fire accident : వేడి తగ్గించేందుకు ఫోమ్ కొడుతున్న సిబ్బంది

సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్స్ లో అగ్ని ప్రమాదం జరిగి రెండు రోజులైనా వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. బిల్డింగ్ నుంచి అక్కడక్కడ పొగలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది వేడిని తగ్గించేందుకు ఫోమ్ కొడుకున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన క్లూస్ టీం ప్రమాదానికి కారణాలు తెలుసుకునే పనిలో పడింది. దాదాపు 10గంటల పాటు మంటలు కొనసాగడంతో బిల్డింగ్ డ్యామేజ్ అయింది.

బిల్డింగ్ పటిష్ఠతపై జీహెచ్​ఎంసీ అధికారులకు ఇవాళ పూర్తిస్థాయి నివేదిక అందనుంది. శుక్రవారం బిల్డింగ్​ స్ట్రక్చర్ స్టెబిలిటీని వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ రమణరావు, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రదీప్ పరిశీలించారు. గంటల తరబడి భవనం మంటల్లో చిక్కుకోవడంతో స్లాబులు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కొన్ని ఫ్లోర్లలో స్లాబులు క్రాస్ అయినట్లు చెప్పారు. కింది అంతస్థులు బాగా డ్యామేజీ కావడంతో వాటిని రిపేర్ చేయడం కూడా కష్టమేనని జీహెచ్​ఎంసీ అధికారులు చెబుతున్నారు.