Fire accident : ఏ క్షణమైనా బిల్డింగ్ కుప్పకూలే ఛాన్స్

Fire accident : ఏ క్షణమైనా బిల్డింగ్ కుప్పకూలే ఛాన్స్

సికింద్రాబాద్ నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మంటలు ఎగిసిపడుతుండటం, పొగ దట్టంగా వ్యాపించడంతో రెస్క్యూ కష్టంగా మారింది. ఐదు ఫ్లోర్లకు మంటలు వ్యాపించడంతో బిల్డింగ్ ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశముందని అధికారులు అంటున్నారు. మరోవైపు బిల్డింగ్ లో చిక్కుకుపోయిన వారిలో ఏడుగురిని రెస్క్యూ సిబ్బంది ఇప్పటికే రక్షించారు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండిపోయిన మరో ముగ్గురిని బయటకు తీసుకురావడం కష్టంగా మారింది. సహాయక సిబ్బంది ఆ అంతస్థులోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా మంటలు ఎగిసిపడుతుండటంతో సాధ్యం కావడం లేదు.

అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్క భవనానికి కూడా మంటలు అంటుకున్నాయి. డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, పోలీస్, ఫైర్ డిపార్ట్ మెంట్ సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 10కిపైగా ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నంచేస్తున్నారు. మరోవైపు మంటలను చూసి స్థానికులు భయాందోళలకు గురవుతున్నారు. సామాన్లు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.