సికింద్రాబాద్ మెడికవర్‌ లో రోగి మృతిపై దుష్ప్రచారం ..డీజీపీకి ఫిర్యాదు చేస్తాం

సికింద్రాబాద్ మెడికవర్‌ లో రోగి మృతిపై దుష్ప్రచారం ..డీజీపీకి ఫిర్యాదు చేస్తాం

పద్మారావునగర్, వెలుగు : సికింద్రాబాద్‌ మెడికవర్‌ దవాఖానలో ఓ యువతి మృతి చెందిన ఘటనపై సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు హాస్పిటల్​యాజమాన్యం వెల్లడించింది. 

గురువారం దవాఖానలో ఎండీ డాక్టర్‌ అనిల్‌కృష్ణ మాట్లాడారు. కొద్ది రోజుల కింద తమ హాస్పిటల్​లో అడ్మిట్​అయిన బాధితురాలికి కిడ్నీలో 16 × 17 × 20 మి.మీ పెద్ద పరిమాణంలో రాయి ఉండటంతో పీసీఎన్‌ఎల్‌ సర్జరీ చేశామన్నారు. ప్రచారం జరుగుతున్నట్టు అది చిన్న రాయి కాదని స్పష్టం చేశారు. 

సర్జరీ తర్వాత తీవ్రమైన ఇన్ఫెక్షన్, ప్లేట్‌లెట్లు పడిపోవడం వల్ల మెదడులో రక్తస్రావం జరిగి చనిపోయారన్నారు. తాము కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించినా  ఫలితం లేదన్నారు. దవాఖాన పరువు తీసేలా అసత్యాలు వ్యాప్తి చేస్తున్న వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.