టూల్స్ & గాడ్జెట్స్ : మీ ఫుడ్ ను ఈ మ్యాట్ పై పెడితే.. వేడి వేడిగా తయారవుతుంది..!

టూల్స్ & గాడ్జెట్స్ : మీ ఫుడ్ ను ఈ మ్యాట్ పై పెడితే.. వేడి వేడిగా తయారవుతుంది..!

చాలామంది ఫుడ్‌‌‌‌ వేడిగా ఉన్నప్పుడు తినడానికే ఇష్టపడతారు. కానీ..

ఉదయం వండిన ఫుడ్‌‌‌‌ రాత్రి వరకు వేడిగా ఉండదు. అలాంటప్పుడు ఈ వార్మింగ్‌‌‌‌ మ్యాట్‌‌‌‌ మీద పెట్టి వేడి చేసుకుంటే సరిపోతుంది. సీహెల్టన్ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ మ్యాట్‌‌‌‌ 10 సెకన్లలో వేడెక్కుతుంది. 10 నిమిషాల్లోనే హై టెంపరేచర్‌‌‌‌‌‌‌‌కి చేరుకుంటుంది. ఈ ఫుడ్ వార్మింగ్ మ్యాట్‌‌‌‌లో టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ని 140 నుంచి 212 డిగ్రీల ఫారన్​హీట్‌‌‌‌ వరకు అడ్జెస్ట్‌‌‌‌ చేసుకోవచ్చు. దాదాపు అన్ని రకాల ఫుడ్స్‌‌‌‌కి ఇది సరిపోతుంది. డైనింగ్‌‌‌‌ టేబుల్ మీద కూడా పెట్టుకుని వాడుకోవచ్చు. 

దీన్ని ప్రీమియం -గ్రేడ్ సిలికాన్‌‌‌‌తో తయారుచేశారు. మన్నిక ఎక్కువ. నాన్-స్లిప్ బేస్​తో వస్తుంది. దీన్ని మడతపెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇది గడ్డకట్టిన ఫుడ్‌‌‌‌ని డీఫ్రాస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫుడ్ వార్మర్‌‌‌‌‌‌‌‌ కేవలం 0.25 KWh కరెంట్‌‌‌‌ని మాత్రమే ఉపయోగిస్తుంది. కాబట్టి కరెంట్‌‌‌‌ బిల్‌‌‌‌ గురించి కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు.

ధర : రూ. 2,499