అట్లాంటా: డీజిల్ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుక్కుంటున్నాడని యూఎస్ సెనేటర్ జాన్ ఒస్సాఫ్ ఆరోపించారు. ఓవైపు డీజిల్ కోసం పుతిన్ వద్దకు కాళ్లబేరానికి వెళ్తున్న ట్రంప్.. మరోవైపు రష్యా ఇంధన ఆస్తుల విక్రయాల ద్వారా తన కుటుంబానికి, సన్నిహితులకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శించారు.
రష్యాకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన ఆయిల్ క్షేత్రాలు, రిఫైనరీలు, పెట్రోల్ బంకులను ట్రంప్ సన్నిహితులకు కట్టబెట్టేందుకు వైట్‌హౌస్ మీడియేటర్ పాత్ర పోషిస్తోందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌తో పాటు ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు.
