షారుఖ్ ఖాన్ ఆస్తులు అన్ని కోట్లా..వాచ్ అమ్మితే లైఫ్ సెట్టైపోద్ది

 షారుఖ్ ఖాన్ ఆస్తులు అన్ని కోట్లా..వాచ్ అమ్మితే లైఫ్ సెట్టైపోద్ది

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh khan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ(Dunki). స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar hirani) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం షారుఖ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంతేకాదు.. షారుఖ్ గత రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. 

పఠాన్ (Pataan), జవాన్ (Jawan) ఈ రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దీంతో ఇది షారుఖ్‌‌కు లక్కీయాస్ట్  ఇయర్ అని చెప్పుకోవాల్సిందే.  ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన షారుఖ్ కు రికార్డులు కొల్లగొట్టడం చాలా తేలికని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..షారుఖ్ ఖాన్ వరల్డ్ టాప్ రిచెస్ట్ యాక్టర్స్ లో 4వ స్థానంలో నిలిచాడు.  ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే నటులలో ఒకరైన టామ్ క్రూజ్ ను అధిగమించి.. వరల్డ్ లోనే  నాల్గవ అత్యంత ధనవంతుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రూ.620 మిలియన్ డాలర్లతో 5వ స్థానంలో టామ్ క్రూజ్ ఉన్నాడు. ఆ తర్వాత సినీ ప్రముఖులు జాకీ చాన్, జార్జ్ క్లూనీ, రాబర్ట్ డి నీరో కూడా ఈ జాబితాలో ఉన్నారు.

దీంతో షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ గురుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. షారుఖ్ ఆస్తుల విలువ సుమారు రూ.770 మిలియన్ డాలర్లు ఉంటాయని సమాచారం. అంటే రూ.6389 కోట్లకు పై మాటే అన్నమాట. ఒక్కో సినిమాకు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ రూ.100 కోట్లుకు పైగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో షారుఖ్ ఒకరు.  

షారుఖ్‌కు సినిమాలే కాకుండా..మరెన్నో బిజినెస్ రంగంలో తనదైన టాలెంట్ తో దూసుకెళ్తున్నారు. IPL జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ యజమానిగా ఉన్నాడు. అంతేకాకుండా షారుఖ్ ఒక చిన్న యాడ్ లో నటించిన కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటాడని సమాచారం. 

ALSO READ:- వాట్సాప్ షాక్ : ఇండియాలో ఒక్క నెలలో 71 లక్షల అకౌంట్స్ పై బ్యాన్

ప్రస్తుతం షారుఖ్‌ నటిస్తోన్న డుంకీ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్ హిరాణీ ప్రజెంటేషన్ బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.