Shah Rukh Khan: షారుక్ ఖాన్ గ్రీన్ సిగ్న‌ల్..సెట్స్ పైకి పఠాన్ 2!

Shah Rukh Khan: షారుక్ ఖాన్ గ్రీన్ సిగ్న‌ల్..సెట్స్ పైకి పఠాన్ 2!

ఒక సోల్జర్ ఎప్పుడూ దేశం తన కోసం ఏం చేసిందని అడగడు. దేశం కోసం తానే ఏం చేయగలడనే ఆలోచిస్తాడు. గతేడాది బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. భారీ యాక్షన్ చిత్రంగా సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన పఠాన్ బాక్సఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే తాజాగా షారుక్ ఖాన్ పఠాన్ 2(Pathaan 2) మూవీ కోసం సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

కాగా, టైగర్, పఠాన్ కు మధ్య జరిగే సంఘర్షనకు పఠాన్ 2 మూవీ నిదర్శనంగా నిలుస్తుందని చెప్పక్కర్లేదు. ఈ చిత్రం కోసం ఆదిత్య చోప్రా టీమ్ గతేడాది నుండే ఈ సీక్వెల్ కు కథ సిద్ధం చేస్తుందట. ఇది ఒక స్పై అండ్ యాక్షన్ మూవీ గా ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సంవత్సరం చివరలో (డిసెంబర్) ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తున్నాయని సన్నిహిత వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

పఠాన్ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. 2023 ఏడాదికి గాను హయెస్ట్ కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఇక హిందీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది.