డంకీ కథ ఇదేనా? ఆసక్తి రేపుతున్న స్టోరీ లైన్

డంకీ కథ ఇదేనా? ఆసక్తి రేపుతున్న స్టోరీ లైన్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan), స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ(Rajkumar Hirani) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ(Dunki). పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న డంకీ మూవీ డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. ఇక సినిమా నుండి ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో వారి అంచనాలను మరింత పెంచేస్తూ.. డంకీ స్టోరీ ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో డంకీ కథేంటో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. 

వైరల్ అవుతున్న వార్త ప్రకారం డంకీ మూవీ కథ ఏంటంటే.. పంజాబ్ లోని ఒక పల్లెటూరిలో నివశించె నలుగురు స్నేహితులు. వారికి ఇంగ్లాండ్ వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ వారికి టిక్కెట్,వీసా లభించవు. దాని కోసం చాలా ప్రయత్నిస్తారు. చివరికి వారికీ సహాయం చేయడానికి ఓ సైనికుడు ముందుకు వస్తాడు. అలా మొదలైన వారు ఇంగ్లాండ్ ప్రయాణం, ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సమస్యలు, స్నేహం, ప్రేమ, కుటుంబం చుట్టూ జరిగేది మిగిలిన కథ.

అక్రమంగా బార్డర్స్ లో జరిగే ప్రయాణాలు, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు, అవి చాలా ఫన్ తో కూడుకున్నవిగా ఉండనున్నాయట. ఓపక్క ఫన్ జనరేట్ అవుతూనే.. ఎమోషనల్ గా కూడా సాగుతుందట ఈ కథ. వింటుంటేనే చాలా కొత్తగా అనిపిస్తున్న ఈ కథను దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఎలా తెరకెక్కించారా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి రియలిస్టిక్ కథలను జనాలకు నచ్చేట్టుగా స్క్రీన్ పైకి తీసుకురావడంలో రాజ్ కుమార్ హిరానీ దిట్ట. దీంతో ఈ సినిమా కూడా భారీ విజయం సాధించడం పక్కా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను డంకీ సినిమా అందుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే డిసెంబర్ 21 వరకు ఆగాల్సిందే.