షారుఖ్ డంకీ టీజర్ వచ్చేసింది.. సలార్ను ఢీ కొట్టే సీనుందంటారా?

షారుఖ్ డంకీ టీజర్ వచ్చేసింది.. సలార్ను ఢీ కొట్టే సీనుందంటారా?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh khan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ(Dunki). స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ(Rajkumar hirani) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం షారుఖ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంతేకాదు.. షారుఖ్ గత రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. పఠాన్(Pataan), జవాన్(Jawan) ఈ రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. 

దీంతో డంకీ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు షారుఖ్. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ పూర్తిగా రాజ్ కుమార్ హిరాని టైప్ లో సాగింది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కాన్సెప్ట్ తో టీజర్ ను కట్ చేశారు. టీజర్ లో చూపించిన సీన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఇక డిసెంబర్ 22న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సలార్(Salaar) రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. షారుఖ్ డంకీ అదే సమయానికి రిలీజ్ కానుంది. దీంతో ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ అంటూ మేకర్స్ రెండు సినిమాలను లేపుతున్నారు. అటు ప్రభాస్, షారుఖ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. మా హీరో అంటే.. మా హీరో అంటూ కామెంట్స్ చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఇక తాజాగా రిలీజైన డంకీ టీజర్ చూసి.. ఈ సినిమాతో మా సలార్ కు పోటీనా. షారుఖ్ డంకీ కి అంత సీనుందంటారా? డిసెంబర్ లో సలార్ కొట్టే దెబ్బకి డంకీ ఆనవాళ్లు కూడా మీగలవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలువనుందో చూడాలి.