Sharukh khan, Ayaan: అల్లు అయాన్ పాట.. షారుఖ్ ఖాన్ ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో

Sharukh khan, Ayaan: అల్లు అయాన్ పాట.. షారుఖ్ ఖాన్ ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) తనయుడు అల్లు అయాన్( Allu Ayan)  పాడిన పాటకు బాలీవుడ్ స్టార్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ (Sharuk Khan) ఫిదా అయ్యారు. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ డంకీ ( Dunky) సినిమాలోని.. లుట్ పుట్ గయా.. ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అదే పాటను అల్లు అయాన్ పడుతూ కనిపించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ వీడియోను షారుక్ ప్యాన్స్  షారుక్ యానివర్స్ క్లబ్ ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా.. షారుఖ్ ఖాన్ వరకు చేరింది.

అది చూసిన షారుఖ్ ఫిదా అయ్యారు. అల్లు అయాన్ తన పాటను పడటంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. థాంక్స్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. పుష్ప సినిమాలోని శ్రీవల్లీ పాటను తన పిల్లలతో ప్రాక్టీస్ చేయిస్తున్నా అని చెప్పుకొచ్చారు. అది చూసిన అల్లు అర్జున్ స్పందిస్తూ.. లవ్ ఎమోజీ జోడిస్తూ తన షారుఖ్ పై అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా ఇండియాలోని ఇద్దరు టాప్ స్టార్స్ సోషల్ మీడియాలో స్పందించడంపై ఇరువురి ప్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక ఈ ఇద్దరు స్టార్స్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారుఖ్ ఖాన్ డీసెంట్ హిట్ అందుకున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పటివరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.