Shahrukh Khan: అంత గ్యాప్ తీసుకోను..ఫ్యాన్స్కు షారుఖ్ ఖాన్ హామీ

Shahrukh Khan: అంత గ్యాప్ తీసుకోను..ఫ్యాన్స్కు షారుఖ్ ఖాన్ హామీ

సినిమా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. ఇంకాస్తా ముందుకి వెళితే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాగే ఫ్యాన్స్ ను ప్రేమించే హీరోలు కూడా ఉంటారు. ఇంకాస్తా సాహసం చేసే ఆలోచిస్తే..ఫ్యాన్స్ కోసం ఏమైనా చేసే హీరోస్ ఉంటారు. హీరోలకి అభిమానులు భక్తుల్లా మారిపోతారు. అలాగే హీరోలు సైతం అభిమానులని దేవుళ్లతో సమానం అంటుంటారు. సరిగ్గా అలాంటి అభిమాన భక్తులను సొంతం చేసుకున్న హీరోస్లో ఒకరు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ భాయ్.

ఈ సూపర్ హీరో నుంచి సినిమా వస్తుంటే చాలు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ నుండి ట్రేడ్ మార్కెట్ వరకు ఎదురు చూస్తుంటారు. కానీ, ఒక రెండేళ్ల కింద..ఈ సూపర్ స్టార్కి హిట్స్ రాకపోగా..వరుస ఫెయిల్యూర్స్ వస్తుంటే ఫ్యాన్స్ చాలా నిరాశలో మునిగిపోయారు. అలాగే షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) కూడా ఎంత పోరాడిన విజయం దక్కకపోవడంతో సతమతం అయ్యాడు. అపుడే మధ్యలో కొంత గ్యాప్ కూడా తీసుకున్నాడు.సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఫ్యాన్స్ కు, షారుఖ్ కు పఠాన్ మూవీ ఊపిరి పోసింది. 

గతేడాది పఠాన్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సఫీస్ లెక్కలు రాబట్టి..ఇండస్ట్రీ రికార్డులు షారుఖ్ పటా పంచలు చేశాడు. ఆ తర్వాత వచ్చిన జవాన్, డంకీ సైతం వసూళ్లతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టాయి. లేటెస్ట్ గా షారుఖ్ ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యాన్స్ కి ఒక హామీ ఇచ్చాడు. 

పఠాన్ ముందు నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న..ఆ విరామ సమయంలో ఫ్యాన్స్ అందరు ఆందోళనకు గురయ్యారని తెలిసింది. 33 ఏళ్లుగా మిమ్మల్ని ఎన్నో విధాలుగా అలరిస్తున్నాను..మధ్యలో కొంత అనుకోని గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే కొన్ని సినిమాలు చాలావరకు ప్రేక్షకాదరణ పొందలేదు. అపుడు నేను మంచి సినిమాలు ఎంచుకోవట్లేదేమో అని అనుకున్నా..అందుకే కొద్దిపాటి విరామం తర్వాత పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో మీ ముందుకు వచ్చాను. ఇకపై అంత గ్యాప్ తీసుకోను..కేవలం రెండు నెలలే తీసుకుంటానని చెప్పారు.

వరల్డ్ వైడ్ గా ఎంతోమంది ఎన్నో విధాలుగా తనపై ప్రేమను, అభిమానాన్ని చూపుతున్నారు. వారి హృదయాల్లో తనపై శాశ్వత స్థానాన్ని ఇచ్చారు. అందుకు తన ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు అని షారుఖ్ ఖాన్ తెలిపారు.  

షారుఖ్‌‌కు 2023 లక్కీయాస్ట్  ఇయర్ అని చెప్పుకోవాల్సిందే. అందుకు పఠాన్, జవాన్ సినిమాలే నిదర్శనం.దీంతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన షారుఖ్కు రికార్డులు కొల్లగొట్టడం చాలా తేలికని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ క్రియేటివ్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో ఒక లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమా కథ కూడా డిఫరెంట్గా ఉంటుందని సమాచారం.