నటి షకీలాపై దత్తపుత్రిక దాడి

నటి షకీలాపై దత్తపుత్రిక దాడి

సీనియర్ నటి, బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-7 కంటెస్టెంట్‌ షకీలా(Shakeela)పై దాడి జరిగింది. ఆమె దత్తత తీసుకున్న కుమార్తె శీతల్‌(Shithal) ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో షకీలా పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ విషయంలో తలెత్తిన మనస్పర్థల కారణంగా శీతల్ ఇంటి నుండి బయటకు వెళ్లినట్టు ఫిర్యాదులో తెలిపారు షకీలా.

అనంతరం మాట్లాడేందుకు పిలవగా.. తన సొంత తల్లిని వెంటపెట్టుకుని వచ్చిందని, సర్ది చెప్పడానికి యత్నించగా.. తనపై దాడికి పాల్పడిందని షకీలా తెలిపారు. అంతే కాకుండా.. గొడవ  సమయంలో పక్కనే ఉన్న మహిళా లాయర్‌పై కూడా శీతల్‌ తల్లి అసభ్యకరమైన కామెంట్స్ చేశారని షకీలా ఆరోపించారు. ఇక అదే పోలీస్‌ స్టేషన్‌లో శీతల్‌ కూడా షకీలాపై ఫిర్యాదు చేశారు. ఇరువైపులా ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా కేసు నమోదు  చేసి, దర్యాప్తు చేపడతామని తేలిపోయారు.