ఐరన్ బాక్స్, అండర్ వేర్లో గోల్డ్ తెచ్చారు..

ఐరన్ బాక్స్, అండర్ వేర్లో గోల్డ్ తెచ్చారు..

శంషాబాద్, వెలుగు: విదేశాల నుంచి అక్రమంగా బంగారం తెస్తున్న ముగ్గురు ప్రయాణికులను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.  నిందితుల వద్ద 3 కిలోల 743 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన విమానంలో ఓ ప్యాసింజర్ ఐరన్ బాక్స్ లో 594 గ్రాములు, 

మరొకరు పోర్టబుల్ స్పీకర్ లైట్లలో 1,225 గ్రాములు, దుబాయి నుంచి ఇంకో ప్రయాణికుడు అండర్ వేర్ లో 1,924 గ్రాముల బంగారం తీసుకునిరాగా తనిఖీలు చేసి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల వద్ద పట్టుబడిన బంగారం 3.743 కిలోలు ఉండడగా.. విలువ 2 కోట్లు 29 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ముగ్గురు నిందితులపై అధికారలు కస్టమ్స్ చట్టం  కింద కేసు నమోదు 
చేశారు.